Monday, June 22, 2009

ఓహ్! గణేశ

అలకాపురి అనే ఒక గందర్వలోకం స్వర్గంలో ఉన్న ఒక ఆడంబరమైన ప్రదేశము, ఆడంబరమునుకు నిదర్శనం అలకాపురి. అటువంటి గంధర్వలోకమునుకు ధనాదిపతి అయిన కుబేరుడు చక్రవర్తి.

కుబేరునికి ఒక రోజు కైలశాదిపతి అయిన శంకరుడుని
దర్శించి తనయొక్క ఆడంబరతను చూపించాలని కోరికతో విందుకు
ఆహ్వానించాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కైలశానికి బయలుదేరాడు. కుబేరుడు కైలశానికి చేరుకున్నతర్వాత,
నిరాడంబరతకు నిదర్శంగా నిలిచే బోలాశంకరుడును విందుకు
ఆహ్వానించాడు. ఆ సమయంలో అక్కడే ఆటలాడుతున్న బాలగణేషుడు వారి
సంబాషణ విని తన తండ్రి అయిన శివునితో నేను కూడా మీతో
విందుకు రావచ్చా? అని అడిగాడు. అప్పుడు శివుడు చిరుదరహాసంతో
కుబేరుడుని అర్ధిస్తూ "నాకు మారుగా నా కుమారున్ని మీవెంట
విందుకు పంపవచ్చా?" అని అడిగాడు.

కుబేరుడు ఆశ్చర్యపడి నిర్గాంత పోయి,
మాటలు రాక బాలగణేషున్ని తీస్కోని వెళ్ళుటకు అంగీకరించాడు.
శివుడు సంతోషిస్తూ, కుబేరునికి గణేషున్ని గూర్చి హెచ్చరిస్తూ
గణేషుడు అతిగా తింటాడని జాగ్రత్తలు చెప్పగా, కుబేరుడు
హేಳనతో కూడిన చిరునవ్వు నవ్వి గంధర్వ లోకంలో అన్న,
పానీయములుకు లోటువుంటుందా? అని శివుడుకు చెబుతూ
బాలగణేషున్ని తన వెంట తీసుకొని పోయినాడు.

తన లోకమైన అలకాపురికి చేరుకున్న కుబేరుడు సేవకులును పిలిపించి
బాలగణేషున్ని రాజ మర్యాదలతో తన లోకానికి ఆహ్వానించి,
సుఘంధ ద్రవ్యములుతో కూడిన పన్నీటి జలము తో
స్నాన మాచరింప జేసి, పట్టు పీతాంబర వస్త్రంలు, వజ్ర,
వైడూర్యముల తో కూడిన, నగలును ధరింప జేసి విందు
కు ఆహ్వానిం చాడు.

గణేషుడు తినటం ప్రారంబించినాడు. తినటం మొదలు
పెట్టిన తర్వాత తన పళ్ళెంలో ఉన్న పదార్థములు
అయిపోగా, మిగిలిన అతిదుల పళ్ళెములో
ఉన్న పదార్థములు కూడా తీసుకొని తినసాగాడు.
ఆ పరిస్థితిని చూసిన కుబేరుడు తన సహనాన్ని
కోల్పోతున్నాడు. కుబేరుడు తన కోపాన్ని సేవకుల పైన,
మిగిలిన అతిదుల పైన ప్రదర్శించ సాగాడు.
కాని గణేషుడు తన పనిని కొనసాగించుకుంటూ
దొరికిన ప్రతి వస్తువును కూడా తిన సాగాడు మరియు గణేషుడు
"ఓ! కుబేర నాకు ఆకలి తీర లేదు. నాకు
నాకు తినుటకు ఇంకా కావాలి," అని అడుగుతూ,
నీవు నాకు తినుటకు ఏమీ సమకూర్చలేని పిదప
నేను నిన్ను తినివేస్తానని! హెచ్చరించినాడు.

అప్పుడు కుబేరుడు భయబ్రీతి చెంది గణేషునికి
సరిపడేంత ఆహారము పెట్టలేక, ఏమీ చేయలేని
స్థితిలో అలకాపురిని విడిచి కైలాశం వైపు పరుగులు పెట్టసాగాడు.
కైలాశం చేరుకున్న కుబేరునికి ధనగర్వం కాస్త మాయమై
శివుడుపాదపద్మములునుచేరి జరిగిన సంగతి వివరించినాడు. అప్పుడు
శివుడు చిరునవ్వుతో కుబేరునికి ఈవిధముగా సెలవిస్తూ "తగ్గింపుతనంతో,
ప్రేమతో, దయతో పెట్టె గుప్పెడు అన్నము చాలు ఏ ప్రాణి ఆకలి తీర్చుటకైన",
అయిన నా కుమారుని ఆకలి తీర్చుటకు ఈ ఒక్క చిన్ని ఉండ్రాయి చాలు.
అని ఒక ఉండ్రాయి ని కుబేరునికి ఇచ్చి అలకాపురి కి పంపినాడు.

కుబేరుడు అలకాపురికి చేరుకున్న సమయానికి
గణేషుడు అలకాపురిని మొత్తంనుద్వంసం చేయసాగాడు.
కుబేరుడు భయ, భక్తులతో శివుడు ఇచ్చిన ఉండ్రాయిని
గణేషునికి నైవేద్యంగా సమర్పించుకున్నాడు.

ఈ నవసమాజంలో ప్రతీ గణేష చతుర్థి నాడు నేను సమర్పించే
కానుకలు గణేషునికి శివుడు పెట్టిన ఉండ్రాయిలా వుంటుందా?
లేక కుబేరుడు యొక్క విందులా వుంటుందా?

నేను ఆడంబరంతో సమర్పించే కానుకలు నీటిని,
భూమిని కలుషితం చేస్తుందా?

నా కానుకలు గణేషుని పైన భక్తిని చుపుతున్నాయా?
లేక నా ఆడంబరతను చాటుతున్నాయా?

ఈ సంవత్సరం నేను చేసిన వినాయక
చతుర్థి శివుడు ఇచ్చిన ఉండ్రాయిలా ఉంటుందా?
లేదా కుబేరుని యొక్క ఆడంబరతను చుపిస్తుందా?

నా ఆడంబరత వలన నీరు, గాలిలో ఉన్న శబ్దం,
ఆకాశం లో ఉన్న చీకటి, మొత్తం
ప్రకృతి కలుషితము అవుతుందా?
ఇది ప్రేమ అని చెప్పవచ్చా?
ఇది భక్తి అని చెప్పవచ్చా?

2 comments: